Friday, July 3, 2009

బావ గారికి..


నాలో ఏముందని ప్రశ్నించిన బావ గారికి అదే మా గోరంట్ల శ్రీ కృష్ణ బావ గారికి..మీ మరదలు..గౌరవం తో...శ్రద్దగా రాసిన చిరు కవిత....
--------౦--------
ఏమి తక్కువని మా శ్రీ కృష్ణుడికి...
ఆరడుగుల అందగాడు... నీల మేఘ శ్యాముడు.....ఆజానుబహుడునూ.... పైగా..
చురకత్తుల చూపూనూ..!!! ఆ చూపుల వలలో చిక్కిన రాధలెందరో మరి...!!!
తన మాటల మాయాజాలం తో.. సమ్మోహన శక్తి తో..ఎదుటి వారిని కట్టేస్తాడు సుమా....!!!
ఎన్ని మాయలు.... ఎన్ని లీలలు.... మహా కొంటె వాడు సుమా!!!

ఏమి లేవని మా గోపాల కృష్ణుడి దగ్గర..
కొండ ని డీ కొనే సాహసం లేదా...
దేన్నైనా ఎదురించే దైర్యం లేదా..
సై అంటే సై అనే పౌరుషం లేదా....
అంతేనా....
ప్రతి చిన్న ఆనందాన్ని ఆస్వాదించే భావుకత ఉంది..
సమస్తం అర్థం చేసుకునే.. తెలివి ఉంది...
సర్వస్వం బరించే సహనం ఉంది..
అందరిని ప్రేమించే.. హృదయం ఉంది...
గిలిగింతలు పెట్టె.. కొంటె తనం ఉంది..
ఎదుటివారి ప్రతి చిన్న కష్టానికి స్పందించే.. మంచి మనసుంది...
ఉన్నయి కదా....!!
మా అల్లరి కృష్ణుడు అన్నింట్లో.. ఘనుడు..సుమా...!!
కదా....!! బావగారు...!!!
----------౦-------------
అన్నీ ఉన్నా మా బావగారి దగ్గర ఒక్కటి మాత్రం ఉండదు... అదేమిటో తెలుసా.....
ఆయన సెల్ లో బాలన్స్..!!!
-----------౦------------
ఏవండోయ్..బావగారు.... చిన్న మాట..!
అటుకులిచ్చిన వాడికి అష్టిశ్వర్యలిచ్చాడట.. ఆ శ్రీ కృష్ణుడు..
మరి మీ లీలల్ని.. మిమ్మల్ని... వర్ణించిన ఈ రచయిత్రికి ఎ బహుమానం లేదా...!!
.............
మొద్దు బావగారు...!!
నా బహుమానం ఏమిటో తెలుసా...!!
అదే మీ పెదాల మీద మెరుస్తోందే ....
మీ చిరునవ్వు......!!!!!
..............
ఇట్లు....
( పేరు తెలుసుగా.....)

4 comments:

కొత్త పాళీ said...

cute :)

రఘు said...

ఎంత అందంగా చేప్పేరండి. మళ్ళి మళ్ళి చదవలనిపిస్తుంది.

Sowmya Mendu said...

thank you......:-)

సృజన said...

Nice....