.jpg)
అర్థరాత్రి...గుర్తొచ్చే.. నీ స్పర్శ తాలుకు వెచ్చదనం...
నువ్వు ప్రేమగా పెట్టిన గోరుముద్దు ల్లోని తియ్యతనం...
నీ చేయి పట్టుకుని మౌనంగా కలిసి నడిచిన దారుల్లోని చల్లదనం..
ఏటి గట్టున..దూరంగా వెళ్ళే రైలు ని చూస్తూ..అల్లరి చేసిన చిన్నతనం..
ఇవ్వన్నీ...మౌనంగా చెక్కిన శిలలని తెలీక... సముద్రపు ఒడ్డున రాతలని నమ్మి... కాలం అనే అలలతో చేరిపెద్దామనుకుంటున్న నా మనసుని చూస్తుంటే జాలి గా ఉంది నేస్తమా..