Friday, December 4, 2009

ఎందుకీ కాలం ఇంతగా పరిగెడుతుంది...
నిన్ను చుసిన క్షణాలని పదిలపరచుకోనీయకుండా...
ఎందుకీ వేగం ఇంతగా తొందర పెడుతుంది...
కళ్ళలో దాగున్న నీ రూపం నిలిచి పోనీయకుండా..
ఎందుకీ మౌనం ఇంతగా కట్టడి చేస్తుంది..
నీతో పలుకైనా మాట్లాడనీయకుండా......
ఎందుకీ ఎద ఇంతగా సవ్వడి చేస్తుంది...
నీ మాటని దరి చేయనీయకుండా..
ఊరించే దగ్గరి తనం..
వేదించే నీ మౌనం...
ఇంకెంతకాలం ప్రియతమా.....

ప్రియా....
నా ప్రేమని నీకివ్వాలంటే... దానిని అమృతంగా.. మలిచి అక్షయ పాత్రలో సమర్పిస్తాను ప్రియతమా..
ప్రతి బిందువు నీకే అంకితం చేసేందుకు.. ఎంత స్వీకరించినా.. ఇంకా పెరిగే నా ప్రేమ దాహం చూపించేందుకు....
ఎన్నటికీ తడి ఆరని..నా ప్రేమ ప్రవాహాన్ని తెలిపేందుకు...ప్రియతమా...

చుట్టూ అన్ని ఉన్నా...తెలియని శూన్యం నన్ను చుట్టుముడుతుంటే....
అందరు చెంతనే ఉన్నా... ఇంకెవరో కావాలని.. కళ్లు ఆత్రంగా చూస్తుంటే..
వెన్నెల రాదనీ ... తెలిసీ... ఆశగా అమావాస్య నాడు కూసే కోయిలనవుతుంటే....
కళ్ళలో... నీ రూపం కన్నీల్లుగా చెక్కిళ్ళపై...జాలువారుతుంటే...
మౌనంగా మాటలు..మైనంగా కరిగిపోతుంటే....
ఏమి చేయాలో.. తెలీట్లేదు ప్రియతమా.........