Monday, August 11, 2008

కార్తిక పౌర్ణమి

కార్తిక పౌర్ణమి తొలి వెలుగులో ..ఆ శివుని ప్రియా సన్నిధిలో ..

వెచ్చని దీపాల మధ్య , చల్లని చిరుగాలి మధ్య ....

నిండైన వెన్నెల ని చూసాను. కానీ నా గుండె గుడిలో నిదురించే నా వెన్నెలని చూసే అదృష్టం కోసం తపిస్తుంటే , ఆ శివుడు నా మొర ఆలకించాడో లేదో కానీ నా కల నిజం చేసాడు. తనని నా ఎదుట నిలిపాడు. క్షణ కాలం కలోఇలో తేల్చుకోలేక పోయాను .

గుండె లో తను రాజేసిన నిప్పుతో , తన లేలేత నవ్వులకు మెరిసిన నా కళ్ళతో తనని చూడాలని ఎగసెగసి పడుతున్న నా మది ని అదిమి పట్టుకొని , తన వైపు తేరి పార చూసాను . క్షణం , తిరిగిరాలేని ఆ ఒక్క క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండు అనిపించింది .

తన మోము, చురకత్తుల చూపు చూసి మైమరిచిన ఆ క్షణం తిరిగి ఎలా వస్తుంది. అన్నింటి కన్నా తన చిరు పెదాలపై నీలాకాశం లో చంద్రుని పక్క చుక్క లా మెరిసే ఆ పుట్టు మచ్చ ని నేనెలా మరువగలను. కనుల ముందు తన రూపం , కనుల వెనుక తన జ్ఞాపకం , మది లో తన ప్రతిబింబం నిలిచిన ఆ క్షణం నేనెలా మరువగలను.

తన చూపు వదిలి వెళ్లి పోతున్నప్పుడు నా మది ఎంతగా ఎగసి పడిందో , తన నవ్వు ఇక చూడలేనని తెలిసిన నా మనసు ఎంతగా బాధ పడిందో నా చెమ్మ గిల్లిన కళ్ళను చుస్తే తెలుస్తుంది .............


నా బాధ..


ప్రియా...

నువ్వు వచ్చే దాక రాలేదని బాధ..

నువ్వు వచ్హాక వెళ్లి పోతావేమో నని భాధ..


నా జీవితం ఎందుకు..


ప్రాణం పోతున్న మిణుగురు పురుగుకు చీకటి వెలుగులెందుకు
ముక్కలై పోతున్న గాజు ముక్కకు తళుకుబెలుకులెందుకు?
జీవం పోతున్న లేడి పిల్లకు అందచందాలెందుకు?
వాడి పోతున్న లేత మల్లెకు పరిమళమెందుకు?
నువ్వు దూరమవుతున్న ఈ లోకం లో
ఇక నా జీవితమెందుకు ??

ప్రియా..

ప్రియా..

కనులు తెరచి చూడలేవా....

నా మోము కేసి కనలేవా ....

నా కంటి పాప కన్నీటి తెరలో మెరిసే నీ

రూపాన్ని గమనించలేవా నేస్తమా ...

నీకై పరితపించి నిన్నే తలచి తలచి

అలసిన నా మనసును తెలుసుకోలేవా ప్రియతమా..

చందమామే..

చందమామే నీ మోముగా నను అలరిస్తుంటే

పిల్లగాలులే నీ శ్వాసలా నను కదిలిస్తుంటే

దీపకంతులే నీ చూపులై నను మురిపిస్తుంటే

చిరు సంగీతం నీ పలుకై నను పలుకరిస్తుంటే

వర్షపు చినుకే నీ స్పర్శలా నను కవ్విస్తుంటే

ఊహ లోకమే నీ సహచర్యంగా నాకు అందిస్తుంటే

కన్నుల కాంతులతో కలలు కంటుంటే

సదా నీ రూపమే ప్రియా....

కలలో నైన నిను ప్రేమిసున్నననే నీ మాట

నే వింటే నా జన్మ ధన్యం సుమా.....

నీకై..

నీ స్నేహపు లోగిల్లో చిక్కిన నా ప్రాణం .....

నీకై అర్పిచేందుకు అది సర్వస్వం సిద్దం ....

నా కళ్ళల్లో అనుక్షణం మెరుస్తుంది నీ రూపం .....

నా మది లో నీ తలపు చేరుతుంది ప్రతి తరుణం....

తొలి చినుకు..



తొలి చినుకు నేలని తాకిన వేళ ..

తన చూపు నా గుండె ని తట్టిన వేళ...

నాలో ఊవ్వేత్తున ఎగసి పడింది ఓ అల ....


వర్షపు నేల మట్టి వాసన నను సోకిన వేళ ..

తన నవ్వు నాలో సంచలనం రేపిన వేళ ...

నా మనసు పొంగుతుంది వరదలా....


పొగ మంచు తెరలు నను కమ్మిన వేళ ..

తన పలుకు నా మది ని మేల్కొలిపిన వేళ ...

నాలో వెళ్లి విరిసింది ఆనంద హేల....


చిరు జల్లు నను తాకి జాలు వారిన వేళ ..

తన స్పర్శ నను కదిలించిన వేళ ...

నా మనసు ఎగిరింది పావురంలా ....