
ప్రియా...........
నా మనసు నా మాట వినట్లేదు...........
నిశిదిలో కురిసే వెన్నెలని చూసినప్పుడు నీ మోము తలచు కోవద్దంటే ,
మనసు మాట వినట్లేదు..........
నా ప్రతి గుండె చప్పుడు లో వినిపించే నీ పేరు మర్చిపోమ్మంటే,
మనసు మాట వినట్లేదు......
ప్రకృతి చేసే ప్రతి చిన్న సవ్వడి లో నీ నవ్వు ని వెతకోద్దంటే,
మనసు మాట వినట్లేదు............
లోకమంతా నిదురపోయే వేళ నువ్వు చెప్పే ఊసులు గుర్తు తెచ్చుకోవద్దంటే,
మనసు మాట వినట్లేదు............
సందె వేళ వీచే చిరుగాలి లో నీ సాన్నిత్యాన్ని ఆస్వాదిన్చోద్దంటే,
మనసు మాట వినట్లేదు.............
నా నుంచి నువ్వు దూరమవుతున్నావని,
కాదేమో............
నా నుంచి నేనే దూరమవుతున్నాననే భావనని వదిలేయ్యమంటే,
మనసు మాట వినట్లేదు...................
ఒంటరిగా ఓడిపోతున్నా..............
మౌనం లో మునిగిపోతున్నా...........
నీ తలపు లో చేరుతున్నా......................
అయినా...................
మనసు మాట వినట్లేదు.................