Sunday, February 21, 2010


i miss u..

అంటే నాకర్థం తెలీదు...
కాని...
నీతో నవ్విన నవ్వుల పరిమళం ఇంకా నన్ను చుట్టుముడుతుంది...
నీతో కలిసి పంచుకున్న వేదనల భారమంతా కన్నీటి చుక్కలా నన్ను వదిలి వెళ్ళిపోతుంది...
నీతో చేసిన అల్లరి... చిరు కొమ్మల సవ్వడి లా.. ఇంకా నాలో వినిపిస్తూనే ఉంది...
నీపై భుజం వాల్చిరాల్చిన కన్నీరంతా..వర్షం లా.. ఇంకా నన్ను తడుపుతూనే ఉంది....
నీ జ్ఞాపకమంతా..నా చేతిలో చేయి వేసి.. గట్టిగా పట్టుకుని ఇంకా దైర్యం ఇస్తూనే ఉంది...
ఇదంతా...ఈ భావన అంతా.. " missing" అంటే..

i miss u...
i miss u so much..